24-05-2025 12:00:00 AM
-భారతీయ జనతా మద్దూర్ సెల్ అధ్యక్షుడు నాగార్జున
ఖైరతాబాద్; మే 23 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని భారతీయ జనతా మద్దూర్ సెల్ (బీజెఎంసీ) రాష్ట్ర నూతన అధ్యక్షులు నాగార్జున తెలిపారు.
భారతీయ జనతా మద్దూర్ సెల్ (బీజేఎంసీ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెల్ జాతీయ అధ్యక్షుడు అర్నాబ్ చటర్జీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి ప్రమాణం చేయించారు.
అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కార్మికులకు చేరవేయడం తన ప్రాథమిక బాధ్యత అని తెలిపారు. ప్రత్యేకంగా ఈస్ట్రం కార్డు ప్రాధాన్యతను తెలియజేస్తూ, ప్రతి కార్మికుడికి ఈస్ట్రం కార్డు ఉండేలా కృషి చేస్తానని అన్నారు. తద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వారికి చేరతాయని తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు జాతీయ న్యాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేఎంసీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.