23-05-2025 11:25:41 PM
మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక సేవలు కాలేశ్వర ముక్తేశ్వరాలయం కేంద్రంగా సాగుతున్న సరస్వతి పుష్కరాల కోసం వైద్య ఆరోగ్యశాఖ విస్తృత సేవలు అందిస్తున్నట్లు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. సరస్వతి పుష్కరాలు జరుగుతున్న 12 రోజులు వైద్య ఆరోగ్యశాఖ 11 క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతిరోజు సుమారు 1000 నుండి 1500 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాలేశ్వరం, ఓల్డ్ ఈవో ఆఫీస్, గుడి ప్రాంగణంలో రెండు, టెంట్ సిటీ, పార్కింగ్ ఏరియా, హరిత హోటల్, జాయ్ రైడ్, గోదావరి మెయిన్ గేట్, సరస్వతి గాట్ నందు క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ క్యాంపు లలో వైద్యాధికారులు పారామెడికల్ సిబ్బంది విడుదలవారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. అన్ని విధములైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయని, దీనితోపాటు 108 వెహికల్స్ 5,బైక్ అంబులెన్స్ 5 అత్యవసర చికిత్స కొరకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. రిఫరల్ హాస్పిటల్ గా మహాదేవపూర్ సి హెచ్ సి నందు 30 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ హాస్పిటల్ నందు నిపుణులైనటువంటి వైద్యులు గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, పీడియాట్రిక్, జనరల్ సర్జన్,అనస్థీషియా, మొదలగువారు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు.
ఎమర్జెన్సీ కేసులను 108 ద్వారా మహాదేవపూర్ సిహెచ్సి సి తరలించడం జరుగుచున్నది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీదేవి, ఉమాదేవి, ప్రమోద్ కుమార్, సందీప్, సుస్మిత అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. సరస్వతి పుష్కరాల్లో తొమ్మిది రోజులలో 61,130మందికి చికిత్స అందించడం, 324 మందిని అడ్మిట్ చేయడం, 19 మందిని వివిధ కారణాల వలన రెఫర్ చేయడం జరిగింది. ఎవరు మృతి చెందలేదని, ముక్తేశ్వర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలలో వచ్చు భక్తులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా వైద్యాధికారి కోరారు. ఈ సేవలో ములుగు డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గోపాల్ రావు, వరంగల్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య విధి నిర్వహణలో వారి యొక్కసేవలను అందిస్తున్నారు.