calender_icon.png 24 May, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాదారుడి నుంచి రక్షించండి

24-05-2025 12:00:00 AM

  1. హయత్ నగర్ డివిజన్ ప్రజల అరణ్యరోదన 
  2. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వినతి 

ఎల్బీనగర్, మే 23 : కబ్జాదారుడి నుంచి తమ ఇండ్లను, ఇంటి స్థలాలను రక్షించాలని హయత్ నగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్, ఆంధ్రకే సరి నగర్ తోపాటు చుట్టుపక్కల కాలనీవాసులు వేడుకుం టాన్నారు. తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని శుక్ర వారం  ఎమ్మెల్యే దేవిరెడ్డి సు ధీర్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ... మేము 40 సంవత్సరాలుగా ఆయా కాలనీల్లో వేల సంఖ్యలో ఇండ్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నామన్నారు. అయితే, ఇటీవల ఒక వ్యక్తి కమలానగర్, ఆంధ్ర కేస రి నగర్ కాలనీలోని ఇంటి స్థలాలు నావేనని ఆర్డీవో కార్యాలయంలో కేసు వేశాడని తెలిపారు. ప్రజలు నివసిస్తున్న స్థలాలపై ఆర్డీవో  స్టేటస్ కో ఇచ్చారని పేర్కొన్నారు. 

మా ఇంటి స్థలాలపై ఎలా స్టేటస్ కో ఇస్తారని కాలనీ సంఘాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై ఆర్డీవోని కలిసి తమ సమస్యలను వివరించారు.  కబ్జాదారుడి నుంచి తమ ఇండ్లను ఇంటి స్థలాలను కాపాడాలని కాలనీవాసులు సుధీర్ రెడ్డిని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్డీవోకు ఫోన్ చేశారు. 40 సంవత్సరాల క్రితం ఇండ్లు కట్టుకొని ఉంటున్నారని, ఇండ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీనిలో భాగంగా బ్యాంకులు లోన్ కూడా ఇచ్చిందని తెలిపారు.

ప్రజలు న్యాయంగా ఇండ్లు కట్టుకొని ఉంటున్నారని, కబ్జాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. కబ్జాదారుడు దురుద్దేశంతో వచ్చి మిమ్మల్ని తప్పుదోవ పట్టించారని తెలిపారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఎవరూ ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దని, త్వరలో ఆయా కాలనీల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఆయా కాలనీ సంఘాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.