29-10-2025 01:02:41 AM
భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఐశ్వర్య రాజేశ్. అటు స్టార్ హీరో ల సరసన ఆడిపాడుతూనే మహిళా ప్రాధాన్య కథలతో నూ మెప్పిస్తోంది. గతంలో తమిళ ‘తిట్టం ఇరండు’, తెలు గు ‘డ్రైవర్ జమున’ వంటి సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఐశ్వర్య ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో శుభారంభం చేసి, విక్టరీ వెంకటేశ్ సరసన కనిపించి నవ్వు లు పంచింది. ఇలా హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళుతోంది. ఆ తర్వాత వచ్చిన అవకాశాల మాట అటుంచి తే.. తాజాగా ఈ భామ ఓ లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ఐశ్వర్యరాజేశ్ లీడ్ రోల్ చేయనుందని టాక్. హారర్ మూవీ ‘మసూద’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సాయికిరణ్ దర్శకత్వంలో మహేశ్వర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం.