calender_icon.png 11 November, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో థ్రిల్లర్ కథతో..

02-07-2024 12:05:00 AM

‘పొలిమేర’ సిరీస్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది కథానాయిక కామాక్షి భాస్కర్ల. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘విరూపాక్ష’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ ‘పొలిమేర 2’తో ప్రేక్షకులకు చేరువైన ఈ డాక్టర్ కమ్ యాక్టర్ ఆ సినిమాకు గాను ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. సినిమాల మీద మక్కువతో హారర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ‘పొలిమేర’ చిత్రానికి రచన, దర్శకత్వం సహా పలు విభాగాల్లో పనిచేసిన ఈ నటి తాజాగా మరో థ్రిల్లర్ కథలో నటించనున్నట్టు కొత్త కబురు వినిపించింది.

నవీన్ చంద్ర కథానాయకు డిగా స్కైలైన్ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. మదన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమవ్వగా, దర్శకులు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, చందు మొండేటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది కామాక్షి. హీరో నవీన్‌చంద్ర సైతం వరుసగా ఈ తరహా సినిమాలే చేస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకుల్ని ఏ మేరకు థ్రిల్ చేస్తారో మరి..!