02-07-2024 12:05:00 AM
‘హను నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మనసిచ్చిన ప్రియుడ్నే మనువాడబోతున్న సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో వరలక్ష్మి నిశ్చితార్థం గత మార్చి నెలలో నిర్వహించారు. కాగా, నేడు థాయ్‌లాండ్ జరుగనున్న వివాహ వేడుకతో ఈ జంట ఒక్కటి కానుంది. సుమారు నెల రోజులపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను స్వయంగా కలిసి పెళ్లికి ఆహ్వానించిన ఆమె.. పెళ్లి సందడి ఆదివారమే ప్రారంభమైంది. సోమవారం జరిగిన మెహందీ వేడుకలో వరలక్ష్మి తండ్రి శరత్‌కుమార్ డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.