27-04-2025 12:00:00 AM
శరీరాన్ని టెక్నాలజీతో అనుసంధానించడం ద్వారా.. మన లోపల ఏం జరుగుతుందో.. ఏయే వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు. ‘బయో హ్యాకింగ్’ ఉద్దేశం అదే. ఆ డేటా ఆధారంగా.. అప్పటికే ఉన్న రుగ్మతలను నియంత్రించవచ్చు. రాబోయే రోగాల్ని కట్టడి చేయొచ్చు. ‘జీన్ థెరఫీ’ సాయంతో లోపాల జన్యువులకు మరమ్మతులు చేసుకోవచ్చు. ఫలితంగా జన్యు సంబంధమైన వ్యాధులను సమర్థంగా అడ్డుకోవచ్చు.
స్టెమ్‌సెల్ థెరపీ, ఐవీ డ్రిప్ థెరపీ, క్రయోథెరపీ, ఇన్‌ఫ్రారెడ్ థెరపీ తదితర విధానాల పనితీరునూ పరిశోధకులు బేరీజు వేస్తున్నారు. కణాల స్థాయిలో.. ప్రొటీన్లలో, మైటోకాండ్రియాలో కొద్దిపాటి మార్పులు చేయగలిగితే వృద్ధాప్యాన్ని జయించడం అసాధ్యమేం కాదంటున్నారు శాస్త్రవేత్తలు.