calender_icon.png 1 May, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో వృద్ధులు ఇవి పాటించాలి!

27-04-2025 12:00:00 AM

తేలికగా, వదులుగా, మెత్తగా ఉండే నూ లు దుస్తులు ధరించాలి. లేత రంగులు లేదా తెలుపువి అయితే మంచిది.

మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం చల్లబడినప్పుడు మాత్రమే వాకింగ్‌కు వెళ్లాలి. 

తరచూ ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. మంచి నీళ్లు, కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు, రాగి జావ, బార్లీ నీళ్లు, సగ్గు బియ్యం జావ, పలుచని మజ్జిగ తాగడం మంచిది. 

తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మసాలాలు, నూనె పదార్థాలు తినకూడదు. 

కాఫీ, టీ తాగకూడదు. వీటివల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. 

ఇంట్లో కిటికీలు తెరచి ఉంచాలి. మధ్యా హ్న సమయంలో ఎండ ఎక్కువగా ఉన్న పక్షంలో కిటికీలకు కర్టెన్లు వేయాలి.