calender_icon.png 1 May, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెన్న వాడుతున్నారా?

27-04-2025 12:00:00 AM

వెన్నతో చేస్తే ప్రతిదీ అద్భుతంగానే ఉంటుంది. వినడానికి, తినడానికి బాగానే ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం హానికరమే అంటున్నారు నిపుణులు. 

వెన్న రోజూ అధిక మోతాదులో తీసుకునే వారిలో ఆయుష్షు తగ్గుతోందని జేఏఎమ్‌ఏ ఇంటర్నల్ మెడిసిన్ అధ్యయనంలో తేలింది. 

రోజుకు పది గ్రాముల వెన్న తీసుకున్న వారిని ఓ చెంచా నూనె తీసుకున్న వారికి పరీక్షించగా.. నూనె తీసుకున్న వారిలో మరణ ముప్పు బాగా తక్కువగా ఉందని పరిశోధనలో వెల్లడైంది. 

మొక్కల నుంచి తీసిన నూనెలతో పోలిస్తే వెన్న ద్వారా శరీరానికి అధిక కొవ్వు అందుతుంది. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

ఇటీవల కాలంలో రెస్టరెంట్లలోనే కాకుండా ఇంట్లో బేక్ చేయడానికి, గ్రిల్, పాన్ ఫ్రైలకి కూడా వెన్ననే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని కారణంగా ఊబకాయం వస్తుంది. 

వెన్నలో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

మొక్కల నుంచి తీసిన నూనెల్లో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆహారం నుంచి పోషకాలను వేగంగా గ్రహించేలా చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడతాయి. 

అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలంటే వెన్న స్థానంలో సోయాబీన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్‌ని ఉపయోగించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.