ప్రాణం తీసిన రీల్స్ మోజు
20-06-2024 05:18 PM
వరంగల్: రీల్స్ మోజులో ఓ యువకుడు ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన వరంగల్ - నర్సంపేటలో చోటుచేసుకుంది. కందకట్ల అజయ్(23) అనే యువకుడికి రీల్స్ చేసే అలవాటు ఉంది. ఉరి వేసుకుంటూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవాలి అనుకున్న అజయ్, ఫ్రిజ్ మీద ఫోన్ పెట్టి.. దూలానికి ఉరి వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా తాడు మెడకు బిగుసుకుంది. ఈ ఘటనలో అజయ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే అజయ్ గతంలో కూడా ట్రీ మూవీలో హీరో ధనుష్ మానసిక పరిస్థితిని అనుకరిస్తూ ప్రమాదకరమైన రీల్స్ చేశాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






