calender_icon.png 21 January, 2026 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

20-09-2024 12:01:07 AM

కూకట్‌పల్లి,  సెప్టెంబర్ 19: ఉరేసుకొని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మూసాపేటలోని రెయిన్‌బో విస్టాలో శివసూర్య వెంకట దీక్షిత్, రాధాకుమారి (41) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో రాధాకుమారి స్కిజో ప్రేనియా వ్యాధి బారినపడగా, చికిత్స చేయించడంతో వ్యాధి తగ్గింది. తిరిగి మరలా ఇటీవల వ్యాధి తిరగబడడంతో చికిత్స తీసుకున్నా తగ్గలేదు.

దీంతో ఆమె ఆలోచనలు ఆత్మహత్యకు దారితీశాయి. ఈ క్రమంలోనే ఓసారి ఫ్లోర్ క్లీనర్ ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో, కుటుంబీకులు గుర్తించి ఆసు పత్రికి తరలించగా తేరుకుంది. తిరిగి ఈ నెల 18న బెడ్‌రూంలో పడుకోవడానికి వెళ్లిన రాధాకుమారి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భర్త తలుపు తట్టగా తీయకపోవడంతో డూప్లికేట్ తాళంతో గదిని తెరవగా ఉరేసుకొని కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.