calender_icon.png 21 January, 2026 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21 నుంచి కార్పొరేటర్ల స్టడీ టూర్

20-09-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): జీహెచ్ ఎంసీ కార్పొరేటర్లు ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు పలు రాష్ట్రాలలోని మున్సిపాలిటీల నిర్వహణను అధ్యయనం చేసేందుకు టూర్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ బృందాలుగా విడిపోయి టూర్‌కు వెళ్లనున్నారు. మేయ ర్ గద్వాల విజయలక్ష్మి నాయకత్వంలో 78 మంది కార్పొరేటర్లు ఇండోర్ మున్సిపాలిటీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో పర్య టించనున్నారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి నాయకత్వంలో మరో 62 మంది అసోం రాష్ట్రంలోని గౌహతి, మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ పర్యటనకు బయలుదేరనున్నారు.