calender_icon.png 17 November, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

17-11-2025 05:49:05 PM

శామీర్ పేట్: మహిళ మెడలోని బంగారు గొలుసును మోటార్‌సైకిల్‌ పై వచ్చిన ఇద్దరు అగంతకులు లాక్కెళ్లారు. ఈ ఘటన తుంకుంట మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. తుంకుంట ఓల్డ్ జిమ్ వద్ద జమున(45) నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3.50 తులాల బంగారు గొలుసు ఒక్కసారిగా లాక్కోని వెళ్లారు. దీంతో వారు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చేసరికి అగంతుకులు అక్కడి నుంచి పరారీ అయ్యారు. అనంతరం బాధితురాలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.