17-11-2025 07:30:59 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను చెన్నైలోని ఆర్మీ రిక్రూటింగ్ డీడీజి, బ్రిగేడియర్ ఆర్. కె. అవస్థి, సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ సునీల్ యాదవ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో బ్రిగేడియర్ ఆర్. కె. అవస్థి, కల్నల్ సునీల్ యాదవ్ చర్చించారు.