17-11-2025 07:34:34 PM
చిట్యాల,(విజయక్రాంతి): తమతో కలిసిమెలిసి ఉన్న మిత్రుడు విధి ఆడిన వింత నాటకంలో దూరమైనా స్నేహితుని కుటుంబానికి అండగా మిత్ర బృందం నిలిచారు. చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన తాటి నరేష్ 2012సం.లో మరణించగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మిత్రులందరు కలిసి సోమవారం 3లక్షల 50వేల రూపాయలను జమచేసి నరేష్ బార్య సరిత, కూతురు మహాలక్ష్మి లకు కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ సభ్యులు గ్రామ ఉపసర్పంచ్ సురిగి లింగస్వామి మాట్లాడుతూ... నరేష్ కుటుంబానికి అండగా ఉంటామని మా తోటి సభ్యుడు మా మధ్యలో లేకపోవడం బాధాకరమని వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని బరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో తాటి సురేష్, పంతంగి గణేష్, మన్నె లింగస్వామి,మాజీ వార్డు మెంబర్ సురిగి లింగస్వామి, సురిగి మహేష్, బండ మహేష్, మునుకుట్ల శ్రీను, సురిగి జంగయ్య, సురిగి అశోక్, సురిగి లింగస్వామి, గోపగోని లింగస్వామి, ఎల్లంకి నరేష్ పాలెం జంగయ్య, దోనూరి సుధాకర్ రెడ్డి, సురిగి లింగస్వామి పాల్గొన్నారు.