17-11-2025 07:29:35 PM
కుంటాల,(విజయక్రాంతి): రైతులు సాదా బైనమా లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం రోజు వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు ఆదేశించారు. పెండింగ్ ఉన్న సాదా బైనమా దరఖాస్తులను విచారణ చేపట్టి వెంటనే పరిష్కారం చూపాలని రైతులకు న్యాయం చేయాలని తెలియజేశారు. అదేవిధంగా తాసిల్దార్ కార్యాలయంలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కారం చూపి సత్కారం ప్రజలకు సేవ చేసే విధంగా కృషి చేయాలని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశించారు.
అదేవిధంగా ఆయా శాఖల పనితీరుపై ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిని మండల వ్యాప్తంగా వేగవంతంగా చేపట్టాలని తెలిపారు ఇందిరమ్మ ఇల్లు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఆయా శాఖల అధికారులకు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఆడే కమల్ సింగ్ ఎంపీ ఓ ఎం ఏ అబ్దుల్ రహీం మిషన్ భగీరథ ఏ ఈ దత్తురాం ఏపీవో గట్టుపల్లి నవీన్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.