17-11-2025 07:39:01 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై బస్సును ఢి కొట్టుకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి నుండి పిట్లం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో హాజీపూర్ గ్రామ శివారులో ఓ ప్రయాణికున్ని దింపేందుకు డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేగా బస్సు ఆగిపోవడంతో వెనుక నుండి వేగంగా వస్తున్న బైక్ మాదిగ కాశీరాం 32 సంవత్సరాలు బస్సులు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపినట్లు ఆయన తెలిపారు.
మృతుడి వయసు 32 సంవత్సరాలు మంబాజీపేట గ్రామం లింగంపేట మండలం చెందిన వ్యక్తిగా తన మోటార్ సైకిల్ తో బస్సును అతివేగం గా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుని అన్న కాశిరాం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మృతి చెందిన ముట్టడి శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.