17-11-2025 07:34:33 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యాశాఖలో వివిధ హోదాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మరియాల ఉదయ్ బాబు సేవలు మరువలేనివిగా నిలుస్తాయని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్ అన్నారు. ఆసిఫాబాద్ పీఎంఆర్‌సీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ ఉదయ్ బాబు సార్ సేవలు గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఎప్పటికీ మరువదు. ఎన్నో బాధ్యతలను నిజాయితీ, నిబద్ధతతో నిర్వహించారు” అని అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం(TSTWTU) జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ మృదుసభావి, సౌమ్యుడు, పరోపకారి అయిన ఉదయ్ బాబు ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, డిప్యూటీ డీఈవో వంటి కీలక పదవుల్లో విశిష్ట సేవలు అందించారు.
సహోద్యోగుల మనసు నొప్పించకుండా అందరి మన్ననలు పొందారుని అన్నారు. జిల్లా క్రీడల అధికారి మడావి శేఖు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యా శాఖకు డిప్యూటీ డీఈవోగా అమూల్యమైన సేవలు అందించారు. గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరి ప్రేమాభిమానాలు పొందారు అని పేర్కొన్నారు.ఉపాధ్యాయ వర్గం వక్తలు మాట్లాడుతూ “విద్యాశాఖలో ఉత్తమ అధికారిగా నిలిచిన ఉదయ్ బాబు సేవలు ఆదర్శనీయం. రిటైర్ అయిన తరువాత కూడా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి మడావి శేఖు, బండ మీనారెడ్డి, TSTWTU జిల్లా కార్యవర్గ సభ్యులు కోశాధికారి కూడ్మేత ఆనంద్, కొమరం మాధవరావు, జాదవ్ ప్రఫుల్, పెందూర్ విశ్వేశ్వర్, చాహకటి శ్యాంరావ్, ధర్మారావ్, రవీందర్, పీఎంఆర్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.