calender_icon.png 17 November, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్

17-11-2025 05:43:24 PM

దేవరకొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత చేపపిల్లల విడుదల కార్యక్రమంలో భాగంగా సోమవార నల్లగొండ జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో చింతపల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో 0.94 లక్షల చేపపిల్లలను దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక అభ్యున్నతి కార్యక్రమం అని తెలిపారు.

మత్స్యకార కుటుంబాల ఆదాయాన్ని పెంచడమే కాకుండా, స్థానిక చెరువుల జీవవైవిద్యాన్ని పెంపొందించడంలో ఈ చేపపిల్లల విడుదల కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. చింతపల్లి పెద్ద చెరువు చేపసంపద అభివృద్ధికి అనువైన వనరుగా మారడం చాలా సంతోషకరం అని అన్నారు. భవిష్యత్తులో కూడా మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.