17-11-2025 07:28:57 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని అంబిటస్ స్కూల్ విద్యార్థులకు నూతన చట్టాల గురించి వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట షీ టీం పోలీసులు అవగాహన కల్పించారు. మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్ బాడ్ టచ్, ఈవ్ టీజింగ్, ఫోక్సో తదితర అంశాలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, లేదా సిద్దిపేట షీ టీమ్ నెంబర్ 8712667434 కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయులు, సిద్దిపేట షీటీమ్ బృందం ఏఎస్ఐ కిషన్, మహిళ కానిస్టేబుళ్లు మమత, రజని, కానిస్టేబుళ్లు లక్ష్మీనారాయణ, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ స్వామి పాల్గొన్నారు.