calender_icon.png 2 November, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్తింటి వేధింపులు.. న్యాయం చేయాలని మహిళ వేడుకోలు

01-11-2025 07:03:35 PM

ఎర్రుపాలెం (విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలం రమన్నపాలెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజారావు భార్య సువర్తమ్మను తన భర్త రాజారావు, ఆడబిడ్డలు, అల్లుళ్లు, బంధువులు వేధింపులతో రోడ్డు మీదకు తోసేస్తే ఇంటి ముందు నాకు న్యాయం చేయాలంటూ భార్య నిరసన వ్యక్తం చేసింది. వివరాలకు వెళ్ళితే ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామానికీ చెందిన తాళ్లూరి రాజారావు(55) మధిర మండలం తోర్లపాడు గ్రామానికి చెందిన సువార్తను(36) 25 సంవత్సరాల క్రితం మూడో సంబంధంగా ఇరు కుటుంబాల పెద్దమనుషుల సమక్షంలో వివాహం చేసుకొని తీరా ఇప్పుడు నా మొదటి సంబంధం పిల్లల చదువులు పెళ్లిళ్లు, కాన్పులు పూర్తయింది.

ఇప్పుడు భర్త రాజారావు నాకు వయసు అయిపోయింది నా శరీరం సహకరించట్లేదు నీతో నాకు శరీరకంగా అవసరం లేదు, నీ అవసరం నా నా పిల్లలకు,కుటుంబానికి, అవసరం లేదు నీ దారి నువ్వు చూసుకోవాలి అంటూ నా భర్త ఆడపడుచులు  బంధువులు అవమానపరిచి రోడ్డు మీదకి నెట్టివేశారు నాకు న్యాయం చేయాలని దీనంగా బతిమిలాడుకున్న వినకుండా ఇంటి నుండి గెంటేశారు. తనకు న్యాయం చేసి సమాజంలో నన్ను గౌరవంగా చూసే విధంగా నన్ను అవమానించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది.