22-05-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, మే 21: మహిళలు స్వయంగా ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. వారికి స్వయం ఉపాధి కల్పన, ఆర్థిక స్వాలంబనే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ లోని తన క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ ఫైనాన్స్‌కార్పొరేషన్ సంస్థ ద్వారా ఉచితంగా 200 మందికి కుట్టు మిషన్లనుజిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ల తో కలిసి అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఒక మిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.