calender_icon.png 22 May, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హిందూ ఏక్తా యాత్ర’లో పాల్గొననున్న అప్పాల ప్రసాద్

22-05-2025 12:00:00 AM

కరీంనగర్, మే 21 (విజయ క్రాంతి): ఈనెల 22న సాయంత్రం కరీంనగర్ లో నిర్వహించే “హిందూ ఏక్తా యాత్ర’లో సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్, ప్రముఖ సంఘసేవకులు, వక్త అప్పాల ప్రసాద్ పాల్గొననున్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ‘హిందూ ఏక్తా యాత్ర’  సాయంత్రం 4 గంటలకు వైశ్యాభవన్ నుండి మొదలై రాత్రి పొద్దుపోయేదాకా కరీంనగర్ సిటీలోని ముఖ్య కూడళ్ల మీదుగా సా గనుంది.  ఈ యాత్రలో ఈసారి కరీంనగర్ లోని వివిధ కుల సంఘాల నాయకులంతా సంఘీభావం తెలిపారు.

వీరితోపాటు వివిధ వృత్తి సంఘాలు, ధార్మిక సంస్థలు, కళాకారులు, కార్మిక సంఘాల నాయకులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేలాది ప్రజలు, హిందుత్వ వాదులు, కాషాయ పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు. వీరికి తగిన రవాణా, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.

పహెల్ గాం ఘటనకు ప్రతీకారంగా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో ప్రజల్లో ముఖ్యంగా హిందుత్వ వాదుల్లో జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో జరగబోయే హిందూ ఏక్తా యాత్రకు పెద్ద ఎత్తున జ నం తరలివస్తారని అంచనా వేస్తున్నారు.