22-05-2025 12:00:49 AM
బూర్గంపాడు,మే21(విజయక్రాంతి): తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట భార్య భైఠాయించిన సంఘటన బుధవారం బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం సారపాక రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వీరన్నతో బిందు కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తనకు పిల్లలు లేరనే నెపంతో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనకు అన్యాయం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని తేల్చి చెప్పింది.