calender_icon.png 18 October, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదరిక నిర్మూలనకు మహిళలు ప్రత్యేక చొరవ చూపాలి

17-10-2025 11:47:37 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కార్యదర్శి యం.సాయి కుమార్ ఆదేశాల మేరకు వరంగల్ రంగశాయిపేట లోని మహిళా స్వశక్తి భవన్ లో పేదరిక నిర్మూలన అంశంపై సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఛీఫ్ లీగల్ ఏయిడ్ కౌన్సిల్ ఆర్.సురేష్ పాల్గొని మాట్లాడుతూ... పేదరిక నిర్మూలనలో మహిళలు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. నిరక్షరాస్యత, నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోక పోవడం వల్లనే పేదరికం పెరుగుతుంది అని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడడానికి స్వయం ఉపాధి పథకాలను అనుసరించాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడి మహిళా సాధికారతకు కృషి చేయాలని తెలిపారు.