calender_icon.png 18 October, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి: కవిత

18-10-2025 10:07:12 AM

హైదరాబాద్: బీసీల బంద్ కు(Telangana BC bandh) మద్దతుగా ఆటోలతో ర్యాలీగా బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు(Telangana Jagruti President) కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ  సందర్భంగా కవిత మాట్లాడుతూ... పదేపదే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు చేసిన మోసాలతో బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మోసాలకి అడ్డుకట్ట వేయాలని కవిత(Kalvakuntla Kavitha) పిలుపునిచ్చారు.

బీజేపీ వెంటనే రాజీనామా చేయాలని కవిత నినాదాలు చేశారు. బీజేపీ ఎంపీల(BJP MPs) త్యాగాలతోనే బీసీ బిల్లుకు మొదటి మెట్టు పడుతుందని కవిత అన్నారు. బీజేపీ ఎంపీలు బయటకు వచ్చి బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే ఫ్యూచర్ లో వాళ్ల ఇళ్లముందు దర్నా, దిగ్బంధం చేస్తామని కవిత హెచ్చరించారు. బీసీ బిల్లు కోసం అనేక ఉద్యమాలు చేశామన్న కవిత(Kavitha) ఈ ఉద్యమాన్ని కోనసాగిస్తామని బీసీలకు విశ్వాశాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు(BC Reservation) 42 శాతం కోటాపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణలో శనివారం రాష్ట్రవ్యాప్త బంద్ ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనకు మద్దతు ఇచ్చాయి.