6 August, 2026 | 8:37 PM

Breaking News

ఏఐకేఎంఎస్ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయాలి: మామిడాల భిక్షపతి   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ధర్మరావుపేట విద్యార్థి ఎంపిక   •   వారాంతపు సంతను ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు   •   300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత   •   ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించిన బోధన్ స్వర్ణకార సంఘం   •   నిజాయితీ, నిరాడంబర జీవనానికి ఆదర్శం ప్రొఫెసర్ జయశంకర్   •   నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి   •   అనుమతి లేకుండా కమ్యూనిటీ హాల్ కూల్చివేత   •   జగ్గయ్యపల్లి ఉపాధి హామీ(వీబీజీ రాంజీ) ఆర్ధిక, అక్రమాలపై ఫిర్యాదులు   •   కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలి   •  

జిల్లాలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి పర్యటన

06-08-2026 07:33 PM

జనగామ,(విజయక్రాంతి): గురువారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ముందుగా పాలకుర్తి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మహిళా కమిషన్ ఛైర్పర్సన్‌కు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి స్వామివారిని దర్శించుకొని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, మహిళలందరికీ రక్షణ, సాధికారత, శ్రేయస్సు కలగాలని ప్రార్థించారు. తదనంతరం ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాముఖ్యత గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఈఓ లక్ష్మీ ప్రసన్న, ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, తహసీల్దార్ సరస్వతి, వర్ధన్నపేట ఏసిపి నర్సయ్య, మహిళా కమిషన్ సభ్యులు, ఇతర అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొని, ఛైర్పర్సన్ కు పూలమొక్కలను అందజేసి, స్వాగతించారు.