6 August, 2026 | 8:59 PM

వరిలో కలుపు నివారణపై రైతులకు అవగాహన

06-08-2026 07:36 PM

నర్సాపూర్: మల్లారెడ్డి విశ్వ విద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ నాలుగో సంవత్సరం విద్యార్థులు రావెప్ కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి పంటలో ప్రీ-ఎమర్జెన్స్, పోస్ట్-ఎమర్జెన్స్ కలుపు నివారణ పద్ధతులు, కలుపు మందుల వినియోగం, సరైన మోతాదులు, సమగ్ర పోషక నిర్వహణ, సూక్ష్మపోషకాల ప్రాముఖ్యత, సేంద్రియ పద్ధతుల ప్రయోజనాలపై గ్రామంలోని రైతులకు వివరించారు. కార్యక్రమంలో రైతులు విద్యార్థులు అయిన సిమ్మీ తానియా , శ్రీకరిణి, వాసవి, హర్షిత లతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.