మల్లారం గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
తల్లాడ /సత్తుపల్లి,(విజయక్రాంతి): తల్లాడ మండలం మల్లారం గ్రామ సర్పంచ్ కటికి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేసించి సర్పంచ్ మట్లాడుతూ మహిళ మణులు అన్నింటి ముందంజలో ఉండాలి.మీ హక్కులకు ఎవరైన భంగం కలిగించిన మీరు వెనుకడుగు వేయకుండా పోరాడి సాధించుకోవాలి. ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్లు దేశానికి మీరు కూడా దీపంగా ఉండాలని మాట్లాడిన్నారు. మహిళ దినోత్సవం సందర్బంగా కేకు కట్ చేసి మహిళ అందరికి శుభాకాంక్షలు తెలిపిన్నారు.
గ్రామస్థాయి మహిళ ఉద్యోగులందరిని సాలువాలతో సన్మానించడం జరిగింది. అందరికి స్వీట్స్ పంపడం జరిగింది. ఆదేవిధంగా 99 రోజులు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామం మొత్తం శుబ్రం చేయడం జరిగింది. గ్రామంలో ఎక్కడ సమస్యలు లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రంలో మండల పంచాయితీ అధికారి ఏ.సురేష్ బాబు , ఉప సర్పంచ్ గుర్రం యశోద ,పంచాయితీ కార్యదర్శి సిద్దిక్ మియా క్రిష్ణారావు ,వార్డు మెంబర్లు ,గ్రామ స్ఠాయి ఉద్వోగులు,గ్రామ నాయకులు పాల్గోన్నారు.




