2 May, 2026 | 8:36 PM

Breaking News

పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •   కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు   •   అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన నిషికా పాత్రుడు   •   రాయలాపూర్‌లో రైతులకు మట్టి పరీక్షా కిట్ల పంపిణీ   •   అసత్య ప్రచారాలను నమ్మోద్దు   •   భూగర్భ గనుల్లో 99 శాతం ఉత్పత్తి   •  

హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం

08-03-2026 05:07 PM

ముఖ్య అతిథిగా హాజరైన నారా భువనేశ్వరి

షాద్‌నగర్,(విజయక్రాంతి): ​హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో ఆదివారం భారీ ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థ ప్రతినిధి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ​ఈ శిబిరంలో పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నాట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు వివరించారు. ​పశు వైద్య శిబిరం అనంతరం, స్థానిక బాల్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానికులు, మహిళలు పాడి రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.