calender_icon.png 18 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆరోగ్యమే మా లక్ష్యం: ఎమ్మెల్యే ధన్‌పాల్

18-09-2025 01:23:11 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): సమీకృత జిల్లా కార్యాలయ సముదాయములో నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభింపబడిన స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ మెగా ఆరోగ్య శిబిరం  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరు య్యారు. దుబ్బ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ మెగా ఆరోగ్య శిబిరంను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దేశవ్యాప్తంగా మహిళలు,పిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, మెరుగైన వైద్యం, నాణ్యమైన సంరక్షణ అవగాహనను నిర్ధారించడం కోసం కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్  బృహత్త్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది అన్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 కేంద్రాలలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మహిళలకు సేవాలాదిస్తారని తెలియజేసారు. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఈఎన్టీ, నేత్ర, రక్తపోటు, మధుమేహం, దంత పరీక్షలతో పాటు నోటి, రొమ్ము ఇతర కాన్సర్, రక్తహీనత, టెలిమానస్ సేవలు, గర్భిణులకు ఆరోగ్యం, సికిల్ సెల్ ఎనిమియా తదితర వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

మాతా శిశు సంరక్షణ (ఎంసీపీ) కార్డు, ప్రధానమంత్రి మాతృ వందన కార్యక్రమంలో పేర్లు నమోదు, సికిల్సెల్ కార్డు, పోషన్ ట్రాకర్లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ తదితర కార్యక్రమాలు నిర్వహించ నున్నట్టు ఆయన తెలిపారు. వైద్య & ఆరోగ్య అధికారులు మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో-డి ఎం హెచ్ ఓ  డాక్టర్ రాజశ్రీ గారు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్ గారు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ అంజనా గారు, డి సి హెచ్ ఎస్, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు, మెడికల్ ఆఫీసర్ దుబ్బ డాక్టర్స్  సుశానా, తాజా మాజీ కార్పొరేటర్ పంచ రెడ్డి ప్రవళిక, శ్రీధర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.