calender_icon.png 18 September, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకుల చరిత్ర తీస్తే భవిష్యత్ ఉండదు

18-09-2025 01:22:28 AM

రేగొండ సెప్టెంబర్ 17(విజయక్రాంతి): మండల కాంగ్రెస్ నాయకుల రాజకీయ చరిత్రను తీస్తే వారికి రాజకీయ పుట్టగతులు ఉండవని రేగొండ మండల బిఆర్‌ఎస్ నాయకులు అన్నారు. బుధవారం బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.

ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు హింగే మహేందర్ మాట్లాడుతూ రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి స్థాయిని మించి రెండు సార్లు ప్రజల చేత శాసనసభకు ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గురించి ఏక వచనంతో సంబోధిస్తూ అహంకార పూరిత మాటలు మాట్లాడడం సరి కాదన్నారు. 

మాజీ కోటంచ చైర్మన్ మాదాడి కరుణాకర్ రెడ్డి, నాయకులు రూపిరెడ్డి చంద్రారెడ్డి, బానోత్ వినోద్, రావుల రమేష్, యువ నాయకులు అనూష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.