4 April, 2026 | 3:59 PM

Breaking News

తాండూర్ సొసైటీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా   •   ప్రముఖ రచయిత్రి స్వర్ణ కిలారికి గూడూరి సీతారాం పురస్కారం   •   సురక్షిత సమాజం కోసం సీసీ కెమెరాల ఏర్పాటు   •   సకాలంలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలి   •   మేడ్చల్ పెద్ద చెరువు కట్ట పైనుంచి కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •  

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

02-05-2024 01:52 AM

కార్యకర్తలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పిలుపు

మహబూబ్‌నగర్, మే 1 (విజయక్రాంతి): బీజేపీ కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పిలుపునిచ్చారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు బుధవారం బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి డీకే అరుణ ఆమె స్వగృహంలో కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే వారికి మున్ముందు గుర్తింపు ఉంటుందన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలో కి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ధర్మానాయక్, సురేం దర్, బుచ్చన్న, మైబు పాల్గొన్నారు.