13 April, 2026 | 8:27 AM

కార్మికులు ప్రగతి నిర్మాతలు

01-05-2024 12:34 AM

మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, ఏప్రిల్ 30( విజయక్రాంతి): కార్మికులు ప్రగతి నిర్మాతలు అని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం(మే డే)ను పురస్కరించుకుని ఆమె కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల భాగస్వామ్యం లేకుండా ఏ వ్యవస్థ అభివృద్ధి చెందదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మికుల సంక్షేమానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే శ్రామిక లోకానికి మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వానికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.