04-10-2025 08:53:36 PM
ఏరియా జిఎం రాధాకృష్ణ
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల కృషి అభినందనీయమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఇన్ రాధాకృష్ణ అన్నారు. ఏరియాలోని కేకేఓసిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ఘనంగా సన్మానించి మాట్లాడారు. ఓసీపీలో ఉత్పత్తి మెయింటెనెన్స్ విభాగాలలో కార్మికుల ప్రతిభ అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని కొనసాగించి గనిలో ఉత్పత్తిని మెరుగు పరచాలన్నారు. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ బొగ్గు ఉత్పత్తి కి కృషి చేయాలని కోరారు.