calender_icon.png 4 October, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మీద నమ్మకం లేకనే పార్టీ నేతలు బీఆర్ఎస్ లో చేరిక

04-10-2025 08:50:09 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. అందుచేతనే కాంగ్రెస్ నేతలే నిరుత్సాహానికి గురై బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. శనివారం తాంసి మండలం వడ్డడి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యతనిస్తున్నారని అందుచేతనే కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు పలువురు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ లు ఇలాంటివి ఏ పథకం అయినా బీదవల్లకు ఇవ్వడం లేదన్నారు. మొదటి నుండి పార్టీ నీ నమ్ముకొని ఉన్న బీదవారికి, కార్యకర్తల కు ఇవ్వకుండా ఇష్టం వచ్చిన నట్టుగా వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు పార్టీ నీ వాడుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ పార్టీ లో న్యాయం జరగదు అని బీఆర్ఎస్ లో పార్టీలోకి రావడం జరుగుతుందనీ తెలిపారు.