calender_icon.png 4 October, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవ్వండి..

04-10-2025 08:54:29 PM

గెలిచే వ్యక్తిని బలపరచండి..

అలంపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ దిశగా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆలంపూర్, ఉండవల్లి, మానవపాడు మండలాలలో స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయని ఎన్నికలలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ తరపున నిలబడిన ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అన్నారు. ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి పక్కన పెట్టి అందరూ సమన్వయంగా గెలిచే వ్యక్తిని స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించుకోవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీ అండదండలుగా ఉంటుందని ఎవరు అధైర్య పడవలసిన అవసరం లేదని అన్నారు. పార్టీ నుండి గెలిచిన అభ్యర్థి తన గ్రామంలో అభివృద్ధి ద్యేయంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యత నేను తీసుకుంటానని తెలిపారు.

గ్రామంలో అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని స్థానిక ఎన్నికలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పలు అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. ప్రధానంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్తు వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, ట్రాన్స్ పోర్ట్ అథారిటీ మెంబర్ పల్లి సతీష్ రెడ్డి, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, రాష్ట్ర నాయకులు షేక్షావలి ఆచారి, మురారి సోమశేఖర్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ జల్లాపురం వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు, అడ్డాకుల రాము, గోపాల్, జగన్మోహన్ నాయుడు, భరత్ రెడ్డి పరమేష్ నాయుడు, శేఖర్, శేఖర్ రెడ్డి, గట్టు రామనాయుడు, టెంపుల్ మద్దిలేటి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు