calender_icon.png 6 August, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లా వాసి యాకూబ్ పాషా ఎన్నిక

05-08-2025 04:58:09 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద గల అబుల్ కలాం అజాద్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నందు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యంఏ. ఫారూఖ్ యాకూబ్ పాషా ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు.

గత కొన్నేళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనారిటీల సంక్షేమం కొరకు నిరంతర శ్రమిస్తూ, విద్యార్ధులకు అండ దండగా ఉంటూ మైనారిటీ సంక్షేమానికి పాటు పడుతున్నందున వీరి సేవలను గుర్తించి, వీరికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందని యంఏ. ఫారూఖ్  తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నిక కాబడిన యాకూబ్ పాషా మాట్లాడుతూ.... రాష్ట్రవ్యాప్తంగా నెలకొని ఉన్న మైనారిటీల సమస్యలపై ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మైనారిటీ సంఘాలు, రాష్ట్ర మైనారిటీ ఉద్యోగ సంఘం టీయస్ మేసా వారు ఎండీ.యాకూబ్ పాషాను ఘనంగా సన్మానించారు.