05-08-2025 05:00:26 PM
చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలపూర్ గ్రామానికి చెందిన పెండ్లి రవి,కంచు చంద్రమ్మ ఇటీవలె అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీకృష్ణ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి చిత్రపటాలకు నివాళులు అర్పించి భరోసా కల్పించారు.