calender_icon.png 11 August, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతమైన వాతావరణంలో ముత్యాలమ్మ జాతర

11-08-2025 02:00:39 PM

ఆలయ ప్రాంగణాలలో రాజకీయ, సామాజిక,ఆధ్యాత్మిక ఫ్లెక్సీలకు అనుమతి లేదు.

జాతరలో డిజేలు నిషేదం: హుజూర్ నగర్ సిఐ చరమందరాజు

హుజూర్ నగర్: పట్టణంలో ఈనెల 17,18,21 తేదీలలో జరగనున్న ముత్యాలమ్మ, కనకదుర్గమ్మ జాతరలను ప్రశాంతమైన వాతావరణంలో  జరుపుకోవడానికి పట్టణ ప్రజలంతా సహకరించాలని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు(Huzurnagar CI Cherabanda Raju) అన్నారు. సోమవారం పట్టణంలోని సిఐ కార్యాలయంలో ముత్యాలమ్మ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 17,18 తేదీలలో జరుగు ముత్యాలమ్మ జాతర 21వ తేదీన జరగనున్న కనదుర్గమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..ప్రతి ఏటా నిర్వహించే  మాదిరిగా జాతరను నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు..అదే విధంగా పెద్ద (ముసలి) ముత్యాలమ్మ, చిన్న (వయసు) ముత్యాలమ్మ ఆలయాలు,కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణాలలో ఎటువంటి రాజకీయ,సామాజిక,ఆధ్యాత్మిక సంబందింత ఫ్లెక్సీలను ఏర్పాటు చేయరాదని సూచించారు.జాతరలో ఎలాంటి డిజేలకు అనుమతి లేదన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామని కమిటి సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,తదితరులు, పాల్గొన్నారు.