11-08-2025 03:02:55 PM
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఉద్దేశించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఓట్ల చోరీపై చర్చ దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల గురించి కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో 420 వాగ్దానాలు చేశారు. ఆరు గ్యారంటీలు(Six Guarantees) అమలు చేస్తామని స్టాంపు పేపర్లపై రాసిచ్చారు. వంద రోజుల్లో పథకాలు అమలు చేస్తామని ప్రకటనలు చేశారని, ఓట్లు వేయించుకుని.. సీట్లు వచ్చాక తప్పించుకోవడం ఓట్ల చోరీ కదా? అని కేటీఆర్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
అటు బీహార్‌లో ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (Special Intensive Revision), ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, పార్లమెంట్ హౌస్ నుండి భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) ప్రధాన కార్యాలయం వరకు నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో సహా ఇండియా బ్లాక్ ఎంపీలను ఢిల్లీ పోలీసులు(Delhi Police) అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (Rahul Gandhi Arrested) రాహుల్ గాంధీ పార్లమెంటులోని మకర్ ద్వార్ నుండి నిర్వాచన్ సదన్‌లోని ఈసీఐ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నారు. వారు పార్లమెంట్ భవనం నుండి ముందుకు వెళుతుండగా, బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు వారిని ఆపారు. టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సహా కొంతమంది ఎంపీలు బారికేడ్లపైకి ఎక్కడం కనిపించింది. మల్లికార్జున్ ఖర్గే సహా మరికొందరు ఆ ప్రదేశంలో ధర్నా నిరసన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సంభాషణ కోసం ఎన్నికల కమిషన్ అపాయింట్‌మెంట్ మంజూరు చేసింది.