calender_icon.png 11 August, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి

11-08-2025 04:37:19 PM

జిల్లా అద్యక్షులు మోటపలుకుల సత్తయ్య..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు మోటపలుకుల సత్తయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐబిలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఐదు నెలల నుండి కమిషన్ రాక రేషన్ డీలర్లు చాలా అవస్థలు పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 25 నుండి ఆగస్టు 25 వరకు రావలసిన కమిషన్ వెంటనే మంజూరు చేయాలన్నారు. రేషన్ డీలర్లు రూమ్ కిరాయిలు కట్టలేక, బియ్యం తూకం వేసే గుమస్తాకు, కరెంట్ బిల్లులు, హమాలీల ఖర్చులు కట్టలేక రేషన్ డీలర్లు అప్పుల పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల కమిషన్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల జిల్లా ఉపాధ్యక్షులు నాగిశెట్టి సురేందర్, మండల ప్రెసిడెంట్ పేరగానే పద్మ భూమేష్, మండల ఉపాధ్యక్షులు పల్లెర్ల మనోహర్, జనరల్ సెక్రెటరీ గుండ రాజన్న, డీలర్లు అంజయ్య, బాపన,లచ్చన్న, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.