11-08-2025 02:29:27 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) సోమవారం నాడు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. కీలక అంశాలపై గంటన్నరకుపైగా సమావేశం కొనసాగింది. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో పీసీసీ, పీఏసీ భేటీ ఉండే అవకాశముంది. పీఏసీ భేటీలో మెజారిటీ నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని నేతలు తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని నేతలు కోరారు. బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనహిత పాదయాత్రలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై నేతలు చర్చించారు.