11-08-2025 03:06:41 PM
గద్వాల: రాఖీ పౌర్ణమి సందర్బంగా సోమవారం కలెక్టర్ ఛాంబర్ నందు బాల సదనం పిల్లలు జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్(District Collector Santosh),అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ,నర్సింగ రావు లకు రాఖిలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్నారులు చూపించిన ప్రేమ మరియు ఆప్యాయత నాకు ఎంతో ఆనందం కలిగించింది. వారితో కలిసి ఈ పండుగను జరుపుకోవడం నాకు సంతోషంగా ఉందని అన్నారు. అలాగే, బాల సదనం పిల్లల చదువు, ఆరోగ్యం కొరకు ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.