11-08-2025 02:41:18 PM
చామరాజనగర్: కేరళ రాష్ట్రం చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బందీపూర్ జాతీయ ఉద్యానవనంలో అడవి ఏనుగు దాడి(Wild elephant attacks) చేయడంతో ఒక పర్యాటకుడు తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడని అధికారులు సోమవారం తెలిపారు. వారి ప్రకారం, ఆదివారం బందీపూర్ అడవి గుండా వెళ్ళే జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది. ఆ పర్యాటకుడు(Tourist) టమోటాలు తింటున్న అడవి ఏనుగును ఫోటో తీయడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. రెచ్చిపోయిన ఏనుగు అతనిపైకి దూసుకెళ్లి, తన బలమైన కాళ్ళతో అతన్ని తొక్కడానికి పరుగెత్తింది. అదృష్టవశాత్తూ, కేరళకు చెందిన వ్యక్తిగా చెప్పబడుతున్న ఆ పర్యాటకుడు గాయాలతో దాడి నుండి బయటపడ్డాడు. గాయాలతో తప్పించుకున్న బయటపడ్డ పర్యాటకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటవీ అధికారులు అతని వివరాలను తెలుసుకుంటున్నారు.