02-05-2025 12:37:58 AM
తరచూ ప్రమాదాల బారిన పడుతున్న కార్మికులు
తాజాగా కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
మేడ్చల్, శామీర్‌పేటలో అనుమతి లేని బట్టీలు
మామూళ్ల మత్తులో అధికారులు
మేడ్చల్, మే 1(విజయక్రాంతి): ఇటుక బట్టీలలో కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. ఇటుక బట్టీల యజమానులు కార్మికు ల భద్రతకు చర్యలు తీసుకోనందున ప్రతిసారి కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నా రు. ఇటుక బట్టీలలో ఎక్కువగా ఒడిస్సా, యూపీ, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికు లు ప్రమాదాలకు గురైనప్పుడు వారికి ఎం తో కొంత డబ్బులు ఇచ్చి గుట్టు చప్పుడు కా కుండా స్వస్థలాలకు పంపుతున్నారు. దీంతో ప్రమాదాల ఘటనలు బయటకు రావడం లేదు.
అంతేగాక కార్మికులకు స్థానిక భాషా రానందున ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇచ్చింది పుచ్చుకొని వెళ్ళిపోతున్నారు. రెం డు రోజుల క్రితం మేడ్చల్ మండలంలో ఒక కార్మికుడు విద్యుదా ఘాతానికి గురై మరణించాడు. గుండ్ల పోచంపల్లి శివారులోని ఇటుక బట్టీలో కాపురి చానుకట్ట (32) అనే ఒరిస్సా కార్మికుడు కరెంట్ షాక్ తో మరణించాడు. మట్టిని తడపడానికి మోటార్ ఆన్ చేసి తిరిగి బందు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ఇటుక బట్టి యజమాని సాంబశివరావు నిర్లక్ష్యంగా స్టార్టర్ ను తడి ప్రదే శంలో పెట్టడం వల్లే కరెంట్ షాక్ తగిలిందని మిగతా కార్మికులు ఆరోపిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు
మేడ్చల్, షామీర్పేట్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ ఒక్క బట్టీకి కూడా పూర్తిస్థాయిలో అనుమతులు లేవు. రెవెన్యూ, మైన్స్, అటవీ, పోలీస్, విద్యుత్, కార్మిక, కాలుష్య ని యంత్రణ మండలి అధికారులకు పెద్ద మొత్తంలో మామూళ్ళు ఇవ్వడం వల్ల వారు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. బట్టి ఏర్పాటు చేస్తున్న స్థలానికి నాలా కన్వర్షన్ ఉండాలి. మట్టి తీయడానికి మైన్స్ అనుమతి ఉండాలి. కొందరు ఒకటి రెండు ట్రాక్టర్లు అనుమతి తీసుకుని వందల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టి తరలిస్తున్నారు. అన్ని అనుమ తులు ఉన్న తర్వాతే విద్యుత్ అధికారులు కనెక్షన్ ఇవ్వాలి. పట్టణాలు, గ్రామాలు, రహదారులకు దూరంగా బట్టీలు ఏర్పాటు చే యాలి. కాలుష్య నియంత్రణ మండలి అనుమతి కూడా తీసుకోవాలి. కానీ ఇవేవీ అనుమతి తీసుకోకుండానే బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ నిబంధనలు.....
*కార్మికులకు బ్యాంకు ఖాతా ద్వారానే జీతాలు ఇవ్వాలి.కార్మికుల కోసం సెక్యూరిటీ నిధి ఏర్పాటు చేయాలి.బట్టీల వద్ద కార్మికులకు వసతి, మరుగుదొడ్లు, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ రేకుల షెడ్ల కింద వసతి ఇవ్వడం వల్ల ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు.ఇటుక బట్టీలలో 50 నుంచి 200 మంది కార్మికులు పనిచేస్తే కార్మిక శాఖ ఉప కమిషనర్ అనుమతి తీసుకోవాలి.20 నుంచి 50 మంది కార్మికులు పనిచేస్తే కార్మిక శాఖ సహాయ కమిషనర్ లైసెన్స్ మంజూరు చేయాలి.20 మందిలోపు కార్మికుల పని చేస్తే స్థానిక కార్మిక శాఖ (ఏ ఎల్ ఓ) అధికారి నుంచి అనుమతి పొందాలి.లక్షల ఇటుకలు తయారు చేస్తున్నప్పటికీ 20 మంది లోపు కార్మికులు ఉన్నారని నిబంధనలకు విరుద్ధంగా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకుంటున్నారు.తరచూ ప్రమాదాలు జరుగుతున్నం దున ఇప్పటికైనా వివిధ శాఖల అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.