calender_icon.png 9 December, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలంపూర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి

08-12-2025 12:12:44 AM

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

అయిజ, డిసెంబర్ 7: అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో ఏకగ్రీవమైన సర్పంచులకు సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గుడి దొడ్డి, రాజాపురం, కురువపల్లి, జడ దొడ్డి , కిష్టాపురం గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచులకు శాలువా కప్పి అభినందించారు. అనంతరం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల మద్దతు ఉండబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో సర్పంచ్ అభ్యర్థులు గెలిపించుకుంటున్నారని అన్నారు.

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఉచిత కరెంటు గ్యాస్ సబ్సిడీ రైతు బీమా రైతు భరోసా రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని.. అందులో భాగంగా వేణీ సోంపురం నుంచి చిన్న తాండ్రపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణం కొరకు ప్రత్యేక జీవో తీసుకొచ్చామని ఉండవల్లి మండలం కంచుపాడు, చిన్న తాండ్రపాడు గ్రామాలలో ఒక్కొక్క  ప్రభుత్వ పాఠశాలకు కోటి రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు.

విద్యావ్యవస్థలో అట్టడుగు ప్రాంతంగా ఉన్న అలంపూర్ ను తన హయంలో డిగ్రీ కళాశాల రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ హాస్టల్ వంటి పలు విద్యాసంస్థలు తీసుకువచ్చి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం జరిగిందని తెలిపారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మోసపూరితమైన మాటలు నమ్మి ప్రజలు ఒకసారి నష్టపోయారని మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఏకగ్రీవ సర్పంచులు,మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప ,మండల అధ్యక్షులు జయన్న రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, సింగల్ విండో మాజీ చైర్మన్ సంకాపురం రాముడు, జెమినీ మద్దిలేటి దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.