calender_icon.png 16 May, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్టలో ప్రపంచ అందాల భామల సందడి

15-05-2025 07:11:53 PM

మిస్ వరల్డ్ పోటీదారుల(Miss World contestants) బృందం గురువారం సాయంత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta)ను సందర్శించారు. ప్రపంచ సుందరీమణులకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని విదేశి అతిథులు భారత సంప్రదాయ చీరకట్టులో దర్శించుకోగా, యాదగిరిగుట్టలో అఖండ దీపారాధనలో సుందరీమణులు పాల్గొన్నారు. అతిథుల పర్యటన దృష్ట్యా యాదగిరిగుట్టలో అధికారులు బ్రేక్ దర్శనాలు, జోడు సేవలు రద్దు చేశారు. 

పోచంపల్లిలో మిస్ వరల్డ్ బ్యూటీలు..

భూదాన్ పోచంపల్లిలో ఆఫ్రికా ఖండానికి చెందినా 25 మంది మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటించారు. సంప్రదాయ నృత్యాలతో ప్రపంచ అందాల భామలకు అధికారులు స్వాగతం పలికారు. పోచంపల్లిలో నేత మగ్గాలను విదేశీ భామలు పరిశీలించారు. అలాగే సుందరీమణులు డోలు వాయించి, మెహందీ పెట్టించుకుని సందడి చేశారు. ఈరోజు రాత్రి 8.30 వరకు ముద్దుగుమ్మలు పోచంపల్లిలో పర్యటించనున్నారు.