16-05-2025 12:04:42 AM
- నిర్మల్ జిల్లాలో నియంత్రణ లేని గంజాయి విక్రయాలు
- ఒకే రోజు మూడు ఘటనలతో పోలీసుల్లో కలవరం
- యువత చెడు మార్గంలో పయనం పెరుగుతున్న నేరాలు
నిర్మల్ మే 15 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా గంజాయికి అడ్డగా మారుతుంది. మారుమూల గిరిజన ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతంలో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగు తుంది. తాజాగా రెండు రోజుల క్రితమే నిర్మల్ జిల్లాలో మూడు చోట్ల గంజాయి తరలిస్తూ పట్టుకున్న వైనం పోలీసు వర్గాల్లో కలవరాన్ని సృష్టించింది.
పాన్ మసాలా గుట్కా గంజాయి కల్తీకల్లు గుడుంబా నియంత్రణపై పోలీసులు ఉక్కు పాదం మోపాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నిర్మల్ జిల్లాలో మాత్రం ప్రతి నెలలో గంజాయి పాన్ మసాలా గుట్కా గుడుంబా యదేచ్ఛగా లభించడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.
నిర్మల్ జిల్లాలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎస్పీగా బాధితుల స్వీకరించిన తర్వాత పోలీస్ శాఖలో అనేక సంస్కరణలను చేపట్టి ప్రజలకు చేరువేందుకు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న గ్రామీణ పట్టణ ప్రాం తాల్లో మాత్రం అక్రమంగా ఉన్న గుట్కా పాన్ మసాలా గంజాయి గుడుంబా స్థావరలపై పోలీసులు దృష్టి పెడుతున్న కొన్ని ప్రాంతాల్లో గుర్తు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
నిర్మల్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దులో ఉండడం చుట్టుపక్కల పెనుగంగా గోదావరి ప్రాణహిత నదులు ఉండడంతో ఇతర ప్రాంతాల నుం చి కొందరు యదేచ్చగా గంజాయిని తిరుమలకు తీసుకువచ్చి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నా రు. బైంసా నిర్మల్ పట్టణంలో ఆరు నెలల్లో 12 మంది వరకు గంజాయితో పట్టుపాడ డం గంజాయి విక్రయాలకు భూతం పోసినట్టుంది.
మూడు నెలల క్రితం పెంబి మండ లంలోని మారుమూల అటవీ గిరిజన ప్రాం తాల్లో సుమారు 50 లక్షల విలువ చేసే గం జాయి మొక్కలను ధ్వంసం చేసి వ్యక్తులపై కేసులు పెట్టారు. తాజాగా మరో రెండు చో ట్ల గంజాయి మొక్కలు సాగు చేయడంతో ఏఎస్పీ రాకేష్ మీనా ఖానాపూర్ పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడం ఇద్దరు గిరిజన రైతులను అరెస్టు చేశారు. అదే రోజు నిర్మల్ బస్టాండ్‌లో 400 గ్రాముల గంజాయి పట్టుపడగా పైసలు గంజాయితో మరో ఇద్దరు అరెస్టు చేశారు.
వీరంతా గతంలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారే కావడం తిరిగి అదే గంజాయితో పట్టుబడడం పోలీ సు వర్గాల్లో తీవ్రత చర్చకు దారితీస్తుంది. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ బైసా కుబీర్ ఖానాపూర్ పెంబి లోకేశ్వరం తానూర్ ముధోల్ బాసర్ కుంటాల నర్సాపూర్ తదితర ప్రాం తాల్లో గంజాయి విగ్రహాలు జోరుగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల కళ్ళు దుకాణాల్లో కల్తీ కళ్ళు ఇదేచ్ఛగా విగ్రహాలు జరుగుతున్నాయి. కృత్రిమ రసాయనాలతో కల్లును తయారుచేసి పేద ప్రజలకు అండగట్టడంతో అనారోగ్యాలు గురవుతున్నారు.
చెడు మార్గంలో యువత పయనం
నిర్మల్ జిల్లాలో యథేచ్ఛగా గంజాయి గుట్కా పాన్ మసాలా గుడుంబా విక్రయాలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతు న్నడంతో దాన్ని నియోగిస్తున్న వారు చెడు మార్గాలను ఆచరిస్తున్నారు. అంత ప్రమాదకరంగా గుడుంబా గంజాయి కావడంతో అది తీసుకున్న మరుక్షణమే ఆ వ్యక్తులు అసాంఘిక నేరలకు ఆర్థిక నేరాలకు దొంగతనాలకు పాల్పడుతూ సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తున్నారు.
బైంసా నిర్మల్ పట్టణంలోని కొందరు వ్యాపారులు గ్రామాలు ఏజెంట్లను పెట్టుకొని ఆర్డర్ ప్రకారం గంజాయిని సరఫరా చేస్తున్నారు. సిగరెట్లు ఇతర రూపాల్లో గంజాయి కి బానిసైన యువత ఇంట్లో పనిచేయకుండా జిల్లాగా తినడం ఆన్లైన్ గేమ్లు వాడడం చెడు మార్గాలను అనువదించడం,, ఆత్మహత్యలకు ఎత్తించడం రోడ్డు ప్రమాదంలో మత్తులో వాహనాలపై ప్రయాణం చేసి ప్రమాదాల గురై కాళ్లు చేతులు విరుగట్టుకోవడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి.
ముఖ్యంగా పదో తరగతి పాసైన పిల్లలు కూడా నమత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ఇటీవలే కుంటాల మండలంలోని ఓ గ్రామంలో 12 మంది యువకులు గంజాయి తీసుకుంటుండగా తల్లిదండ్రులకు తెలవడంతో అక్కడికి చేరుకులలోపై సరఫరా చేసే వ్యక్తి పరారయ్యారు. పట్టణంలోని గాజులపేట్ షేక్ సాయిపేట్ చిక్కడపల్లి గాజులపేట్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా గంజాయి గంజాయి సాగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
సమాజానికి ఉపయోగపడే యువత మత్తు పదార్థయాలకు బానిస ఐ తమ జీవితాన్ని పణంగా పెడుతున్న తరుణంలో గంజాయిని గుడుంబాను అరికట్టాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పై ఉంది. దీనికి తోడు పెంబి దస్తురాబాద్ సారంగాపూర్ కుంటాల కుబీర్ తానూర్ లోకేశ్వరం మండలాల్లో గిరిజన మారుమూల గ్రామంలో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
నల్ల బెల్లం పట్టిక ఇతర రసాయనంతో కూడిన గుడుంబా మార్కెట్లో తక్కువ ధరకు లభించడం వల్ల మత్తు కోసం దాన్ని కొనుగోలు చేసి యువత సేవిస్తుండడంతో అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు నేర ప్రవృత్తి పెరుగుతున్నట్టు పోలీసులు రికార్డులే చెప్తున్నాయి. పోలీసులు ఆప్కారి శాఖ వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే తప్ప వాటి జోలికి వెళ్లడం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కడెం దస్తురాబాద్ కుబీర్ లక్ష్మణ్ చందా మామడ మండలంలో గుడుంబా స్థావరం ఇది చాలా నిర్వహించబడుతున్నారు. ప్రస్తుతం మద్యానికి బానిసైన వారు మత్తు వదిలే ప్రసక్తి లేకపోవడంతో ప్రభుత్వ వైన్ షాపుల్లో లభించే మద్యం ఖరీదు కావడంతో గుడుంబా గంజాయి మార్కెట్లో తక్కువ ధరకే లభించడంతో వాటిని కొనుగోలు చేసి సేవించడం వల్ల పరిస్థితి చేజారిపోతున్నట్టు కొన్ని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు ఆప్కారి శాఖ మాత్రం అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించి గుడుంబా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్న తిరిగి అదే ప్రాంతంలో అదే వ్యక్తులు ఈ దందాను నిర్వహిస్తున్నట్టు గ్రామాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
పట్టుబడితే చర్యలు
నిర్మల్ జిల్లాలో అక్రమ గంజా యి గుడుంబా తెల్లకల్లు విక్రయాలపై జోరుగా ఫిర్యాదులు వస్తున్నాయని అటువంటి దందాకు ఎవరు పాల్పడిన కఠినంగా శిక్ష ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా లో గంజాయి గుట్కా అక్రమ రవాణా పై ప్రతిరోజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి నియం త్రణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ఇప్పటికీ పెంబి ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న గిరిజన రైతులను పట్టుకొని గంజా యి మొక్కల ను ధ్వంసం చేసి కేసు పెట్టడం జరిగిందన్నారు. ప్రజలు కూడా గంజాయి కుటుక అక్రమంగా ఎక్కడ రవాణా చేసిన విక్రయించిన విక్రయించిన పో లీసులకు సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆమె వెల్లడించారు.