14 June, 2026 | 1:48 AM

నిమ్స్‌లో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

14-06-2026 12:00 AM

పంజాగుట్ట,జూన్ 13 (విజయక్రాంతి): ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లోని ఇమ్యునోహీమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శనివారం నిమ్స్ పాత భవనంలోని లెర్నింగ్ సెంటర్లో జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సమాజంలో ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్న స్వచ్ఛంద రక్తదాతలను, రక్తదాన శిబిరాల నిర్వాహకులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యున్నతమైన ప్రాణదానమన్నారు. ఒక యూనిట్ రక్తం ద్వారా అనేక మంది రోగుల ప్రాణాలను కాపాడవచ్చని స్పష్టం చేశారు.

ఈ  కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి లక్ష్మీ భాస్కర్, బ్లడ్ బ్యాంక్ హెచ్.ఓ.ఢఋ డాక్టర్ సుధీర్ వుజ్జిని, డాక్టర్ కె. మహేష్, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యగౌడ్, అలైడ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిఫల్ శ్రీనివాసులు, డాక్టర్ మార్త రమేష్, బిడుగు శేఖర్, వెంకటరత్నం, నిమ్స్ డాక్టర్లు మౌనిక, పుష్పజ, డ్యూటీ డాక్టర్లు, స్వచ్ఛంద రక్తదాతలు, పలు సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.